న్యూఢిల్లీ శివార్లలో ఘోరం..అనుమానాస్పద స్థితిలో మూడు మృతదేహాలు!

వాస్తవం ప్రతినిధి: న్యూఢిల్లీ శివార్లలో ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మూడు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. గురుగ్రామ్ సమీపంలోని బ్రిజ్ పురా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో నేలపై ఓ పురుషుడు, స్త్రీ మృతదేహాలుండగా, మరో స్త్రీ మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. అక్కడే అపస్మారక స్థితిలో పడివున్న ఓ బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఓ మహిళ, తన అత్తను, భర్తను, బిడ్డను హతమార్చి, తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నట్టు వెల్లడించిన పోలీసు వర్గాలు, కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు. వీరి మరణాలకు కారణాలను అన్వేషించే పనిలో ఉన్నారు.