ధ్యాన్‌చంద్‌ కు ఘన నివాళి

వాస్తవం ప్రతినిధి: హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ‘శాట్స్‌’ ఎండీ ఎ. దినకర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత హాకీ క్రీడకు ధ్యాన్‌చంద్‌ చేసిన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ‘సాయ్‌’ రీజనల్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ సుందర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సీఎం సత్యరాజ్, ‘శాట్స్‌’ డిప్యూటీ డైరెక్టర్‌ జి.ఎ.శోభ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ విమలాకర్‌ రావు పలువురు కోచ్‌లు, క్రీడాకారులు, గచ్చిబౌలి స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు.