“హరికృష్ణ” మృతితో…“అరవింద సమేత” పై…“కీలక నిర్ణయం”

వాస్తవం సినిమా: హరికృష్ణ మృతి టీడీపీ శ్రేణులకి నందమూరి అభిమానులకి..కుటుంభ సభ్యులకి ఆయన్ని ప్రత్యేకంగా ప్రేమించే వారికి తీరని లోటు ఈ లోటు కూడా ఎవరూ పూడ్చలేనిది. అందరికంటే కూడా ఆయన కుటుంభ సభ్యులకి తీరని లోటు నందమూరి వంశంలో జరుగుతున్న వరుస మరణాలు అభిమానులని కలిచి వేస్తున్నాయి. ఆయన మృతి సినిమా ఇండస్ట్రీ తీరని లోటుగానే చెప్పాలి..ఈ రోజు సాయంత్రం లోగా హరి కృష్ణ అంత్యక్రియలు ముగుస్తాయి ఇదిలాఉంటే..


ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’..శరవేగంగా షూటింగ్ జరుపుకుని దసరాకి విడుదల అవ్వడానికి సిద్దం అవుతోంది అయితే ఈ తరుణంలో హరికృష్ణ మృతి తో అరవింద సమేత దారెటు..? ఏమి జరుగబోతోంది..? అనే వార్తలు ఇప్పుడు సినిమా వర్గాలని అభిమానులని సైతం కలవర పెడుతున్న వార్త…తానోటి తలిస్తే..దైవం ఒకటి తలచినట్లుగా హరి కృష్ణ మృతితో ఎన్టీఆర్ ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొండటం అసాధ్యం.

ఎన్టీఆర్ కి తన తండ్రి హరికృష్ణ అంటే ఎంతటి ప్రేమో అందరికి తెలుసు..ఎన్నో సందర్భాలో ఎన్టీఆర్ తన తండ్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు..మరి అలాంటి ఈ సమయమోలో షూటింగ్ జరపడం కష్టసాద్యమే..అయితే ఈ క్రమంలో అనుకున్న సమయానికి టాకీ పార్ట్ పూర్తి అవ్వకుండా ఉంటే దసరా కి రిలీజ్ చేయడం కష్టం దాంతో ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. అయితే త్రివిక్రమ్ కూడా దీపావళికి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా టాక్ వస్తోంది.