ఇప్పుడు అందరినోటా పరశురామ్ మాటే..

వాస్తవం సినిమా: “గీత గోవిందం” ద‌ర్శ‌కుడు పరశురామ్ సక్సస్ బాట పట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సినిమాలు తీసినా…ఆయన పేరు సామాన్య ప్రేక్ష‌కుల‌కి అంత‌గా ప‌రిచ‌యం లేదు. గీత గోవిందంతో ఒక్క‌సారిగా అందరి చూపు ఆయ‌న‌పై ప‌డింది. గీత గోవిందం విజయంతో జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది దాంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. 55 కోట్ల రూపాయ‌ల బ్లాక్‌బ‌స్ట‌ర్ ఈ మూవీ. ఇంత పెద్ద హిట్ రావ‌డంతో నిర్మాత‌లంతా ఆయ‌న వెంట ప‌డుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఒక మూవీ చేయ‌మ‌ని అడిగాడ‌ని ఇటీవ‌ల సోషల్ మీడియాలో జోరిగా ప్ర‌చారం జ‌రిగింది. ఐతే అది ఇపుడే ఉండ‌ద‌ని అంటున్నాడు ఈ న‌ర్సీప‌ట్నం బాబు. ఇక నుంచి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలే చేస్తాను అని అంటున్నాడు పరశురామ్.