సూర్య సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్న మోహన్ బాబు

వాస్తవం సినిమా:   కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ తమిళ చిత్రం అంగీకరించారని తెలుస్తోంది.తమిళ స్టార్ హీరో సూర్య నటించే కొత్త సినిమాలో మోహన్ బాబు నెగెటివ్ రోల్ చేస్తారని సమాచారం. ‘గురు’ సినిమాతో సత్తా చాటుకున్న సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుందట. సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడా అతడి సినిమాలు భారీ స్థాయిలో రిలీజవుతాయి. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుతో ఒక పాత్ర చేయిస్తే సినిమాకు బాగా కలిసొస్తుందని.. వెయిట్ పెరుగుతుందని సుధ భావించిందట.
అలాగే సినిమాలో విల‌న్‌కు ఎక్కువ స్కోప్ ఉండ‌టంతో మోహ‌న్ బాబు అయితే బాగుంటుంద‌ని ఆయ‌న‌ను స్వ‌యంగా హీరో సూర్య‌నే అడిగార‌ట‌.సూర్య అడ‌గ‌టం మోహ‌న్ బాబు వెంట‌నే ఒప్పుకోవ‌డం చ‌క‌చ‌క జ‌రిగిపోయ్యాయి అని తెలుస్తుంది.ఈ సినిమాను త్వర‌లోనే సెట్స్ మీద‌కు తీసుకువెళ్ల‌నున్నారు.