తొలిసారిగా త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకొంటున్న పూజా హెగ్డే

వాస్తవం సినిమా: మాతృభాష తెలుగు పై త్రివిక్ర‌మ్‌కి ఎంత మ‌మ‌కార‌మో తెలిసిందే. సాధారనంగా ఆయన సినిమా టైటిల్స్ అచ్చ తెలుగులో ఉంటాయి. డైలాగులు కూడా అంతే. త‌న క‌థానాయిక‌ల్ని కూడా తెలుగులోనే మాట్లాడ‌మంటారు. వాళ్ల‌తోనే డ‌బ్బింగ్ చెప్పించుకోవ‌డం ఓ సెంటిమెంట్‌గానూ మార్చుకున్నారు.
‘అజ్ఞాత‌వాసి’ కోసం కీర్తి సురేష్‌తో డ‌బ్బింగ్ చెప్పించారు. ‘అ.ఆ’ స‌మ‌యంలోనూ అంతే. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తొలిసారిగా డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌’లోనూ అదే సెంటిమెంట్ కొన‌సాగింది. ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది పూజా హెగ్డే. ఆమెతో తొలిసారి డ‌బ్బింగ్ చెప్పించారు. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా ద్వారా తొలిసారి త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది పూజా.