జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

వాస్తవం ప్రతినిధి: రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని విషాదాన్ని నింపి వెళ్ళిపోయారు సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ. ఆయన భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. అందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. మెహదీపట్నం ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ ఇంటి నుంచి 2.30 గంటల ప్రాంతంలో అంతిమ యాత్ర మొదలై సరోజిని దేవి కంటి ఆసుపత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్‌, టోలిచౌకి, ఫ్లైఓవర్‌, కేఎఫ్‌సీ, అర్చెన్‌ మార్బెల్స్‌, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్‌ స్కూల్‌, విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌ నుంచి కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్‌ మీదుగా మహాప్రస్థానం చేరుకుంటుంది. సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. హరికృష్ణ అంతిమ యాత్ర నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.