జోరు తగ్గిన ఫ్యాన్ స్పీడు..రీజన్ ఇదేనా..?

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఒక పక్క అన్ని పార్టీలు ఎన్నికల హడావిడిలో కోలాహలంతో టెన్షన్ వాతావరం నెలకొంటే మరో పక్క పాదయాత్ర తో రాష్ట్రం మొత్తం తిరుగుతూ నోయోజకవర్గాల నేతల్లో స్పీడు పెరిగేలా చేశారు..ప్రజలు కూడా జగన్ పాదయాత్రలో తండోప తండాలుగా వస్తున్నారు దాంతో ఫ్యాన్ స్పీడు కి బ్రేకులు పడే అవకాశమే లేదని అనుకున్నాడు జగన్ అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం వైసీపీలో జగన్ పాదయాత్ర తాలూకూ స్పీడు ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది..

అదేంటి జగన్ పాదయాత్ర సక్సెస్ అయ్యింది కదా మళ్ళీ ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే సందేహం సహజంగా అందరికీ కలుగుతుంది..అయితే జగన యాత్ర చేసినప్పుడు ఊపు కొనసాగుతోంది అది వాస్తవమే అయితే ఆ స్పీడు ని నేతలు అందుకునే లోగానే మళ్ళీ జగన్ తీసుకునే నిర్ణయాలు వైసీపీ నేతల్లో ఆందోళన రేపుతున్నాయి..ఎందుకంటే తాను పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిన నియోజకవర్గాలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్దులకి ధీటుగా ఇప్పటి వరకూ ఫలానా వ్యక్తులు అభ్యర్ధులు అని చెప్పలేక పోవడం టిక్కెట్టు ఎవరికీ ఇస్తారో తేల్చక పోవడంతో ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు..


అయితే నియోజకవర్గ స్థాయిలో వైసీపీ ఇప్పటికే నాయకత్వం ఉంది. కాని కేడర్‌ను దగ్గరుండి నడిపించగల ఆర్ధిక స్థోమత లేనివారు కొందరు ఉంటే పార్టీ వ్యవహారాల్లో నేరుగా తలదూర్చకుండా పైపైకి నాయకత్వం వహిస్తున్న వారు మరికొందరు ఉన్నారు..అసలు టిక్కెట్టు ఖాయం అవుతుందా లేదా అని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు..ఇప్పుడు భాద్యతలు స్వీకరిస్తే తరువాత జగన్ టిక్కెట్టు ఇవ్వకపొతే అనే ఆలోచన చేస్తున్న వాళ్ళుకూడా ఉన్నారు దాంతో ఈ కారణాలు అన్నీ కూడా వైసీపీ స్పీడుకి బ్రేకులు వేస్తున్నాయి..

గత ఎన్నికల్లో ముందుగానే నేతలకి ఓ స్పష్టత ఉండేది మాకు టిక్కెట్టు వస్తుంది అనుకునే వాళ్ళు చురుకుగా ఎన్నికల పనుల్లో నియోజకవర్గాల పార్టీ సమావేశాల్లో పాల్గొంటూ భాద్యతగా తిరిగేవారు , ఆర్ధికపరమైన సమస్యలు వచ్చినా టిక్కెట్టు వస్తుందనే నమ్మకంతో అప్పులు చేసుకుని మరీ రంగంలో దూకే వారు..కానీ ఇప్పుడు వైసీపీలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు సరికదా జగన్ తీసుకునే నిర్ణయాలతో నేతలు ఏమి చేయాలో తోచక తప్పించుకుని తిరిగే పరిస్థితి ఎదురవుతోంది..దాంతో జగన్ కాళ్ళు అరిగేలా తిరిగి చేస్తున పాదయాత్ర బూడిదలో పోసిన పన్నీరే అంటున్నారు విశ్లేషకులు..