లాలూ కోర్కెను తిరస్కరించిన న్యాయస్థానం

వాస్తవం ప్రతినిధి: దాణా కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం కోర్టులో లొంగిపోయారు. దాణా కుంభకోణం కేసులో ఆయనకు ఐదేళ్ల శిక్ష పడింది. అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. పెరోల్ గడువు ముగియడంతో మరో మూడు నెలల పాటు పెరోల్ పొడిగించాలని కోర్టును కోరారు. అందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన కోర్టులో లొంగిపోయారు. కోర్టు తీర్పుపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే కోర్టులో లొంగిపోతున్నట్టు ఆయన తెలిపారు.