సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు గృహ‌నిర్భందం లో వరవరరావు

వాస్తవం ప్రతినిధి: మోదీ హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌నే ఆరోప‌ణల‌తో విర‌సం నేత వరవరరావును అరెస్ట్ చేసిన పూనే పోలీసులు కోర్టు ఆదేశాల‌తో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు గృహ‌నిర్భంధంలో ఉంచ‌నున్నారు.

ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. అందులో భాగంగా విరసం నేత వరవర రావుతో పాటు మరో నలుగురు పౌరహక్కుల నేతలను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు.

ప్ర‌జాసంఘాలు కోర్టుకు వెళ్లడంతో హౌస్‌ అరెస్ట్‌ చేసి  విచారణ జరపాలని సుప్రీంకోర్టు  పోలీసులను ఆదేశించింది. ప్రధాని మోదీ హత్యకు మావోలు కుట్ర పన్నారనీ, దానికి వరవరరావు ఆర్థికసాయం చేస్తారన్నట్లు మహారాష్ట్రలో లేఖలు లభ్యమైన సంగతి తెలిసిందే.