“పశ్చిమ” లో ఈ స్థానాలు జనసేనకి…“కంచుకోటలు”

వాస్తవం ప్రతినిధి: గోదావరి జిల్లాల పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది పశ్చిమ గోదావరి జిల్లానే..తూర్పు గోదావరితో పోల్చుకుంటే పెద్ద జిల్లా కాకపోయినా పశ్చిమ జిల్లా మాత్రం రాజకీయంగా కానీ మరే ఇతర అంశాల పరంగా అయినా వార్తల్లో నిలుస్తుంది..ఈ జిల్లాపై రాజకీయంగా అత్యధిక స్థానాలు గెలుచుకునే వారికి ప్రభుత్వ ఏర్పాటులో తిరుగు ఉండదు అనే సెంటిమెంట్ కూడా ఉంది..అయితే గతంలో రెండు పార్టీలే ప్రధానంగా పోటీ పడటంతో జిల్లాలో ఉన్న 15 స్థానాలని రెండు పార్టీలు పంచుకునేవి.


అయితే..గత ఎన్నికల్లో వైసీపీ కి ఒక్క సీటు కూడా ఇక్కడినుంచీ రాకపోవడంతో ఖంగుతిన్న జగన్ ఈ సారి పశ్చిమ పై పూర్తి స్థాయిలో పట్టు బిగించడానికి సిద్దమయ్యాడు..ఇక రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోరుతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయోనని అందోళన చెందుతున్నాయి మూడు పార్టీలు..ఇదిలాఉంటే టీడీపీ ,వైసీపీ నేతల ఇరువురి సొంత జిల్లాలలో పట్టు సాధించుకున్నవాళ్ళే అయితే పవన్ తన సొంత జిల్లా అయిన పశ్చిమలో కూడా పూర్తి స్థాయిలో పట్టు బిగించడానికి వ్యూహాలు రచిస్తున్నాడు..

పశ్చిమని జనసేన కంచుకోటగా చేసుకోవడానికి వ్యుహాలు పన్నుతున్నాడు..అయితే పవన్ అభిమానుల పరంగా కానీ కుల సమీకరణాల దృష్ట్యా చూసుకుంటే పశ్చిమలో జనసేన ప్రభావం దాదాపు 7 నియోజకవర్గాల పై ఉంటుందని అయితే ఎన్నికలు సమీపించే సమయంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో పర్యటిస్తే తప్పకుండా పది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు..అయితే ఇప్పుడు పవన్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల లిస్టు పరిసీలిస్త్తే..

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం అయిన పాలకొల్లు జనసేన కి చెదిరిపోని కోటగా నిలుస్తుందని.. అక్కడ గెలుపు ఖాయమనే టాక్ వినిపిస్తోంది..ఇక పక్కనే ఉన్న మరొక నియోజకవర్గం అయిన నరసాపురం , భీమవరం సీట్లు కూడా జనసేన ఖాతాలోకి వెళ్ళడం ఖాయం అంటున్నారు..ఇక ఉంగుటూరు, ఏలూరు , తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు సైతం జనసేనకి చెక్కు చెదరని కంచుకోటలుగా మారుతాయని విశ్లేషకులు ఘంటాపథంగా చెప్తున్నారు..అయితే పవన్ ఈ స్థానాలని కాపాడుకుంటూనే మిగిలిన నియోజక వర్గాలో పట్టు బిగిస్తూ ముందుకు వెళ్తే జనసేన జోరుకి సైకిల్ ,ఫ్యాన్ కొట్టుకు పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ మేధావులు..