మే డ్యాన్స్ వీడియో వైరల్

వాస్తవం ప్రతినిధి: బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియో ను దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ సంబంధాలు, సహకార విభాగం ఇంటర్‌నెట్‌లో పోస్ట్‌ చేయడంతో థెరిస్సా జరుపుతున్న దక్షిణాఫ్రికా పర్యటన కన్నా ఈ డ్యాన్స్‌ వీడియో ఎక్కువగా అందరినీ ఆకట్టుకుంటోందట. ఇరుదేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాల వృద్ధి లక్ష్యంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో థెరిస్సా మే పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె కేప్‌టౌన్‌లోని హైస్కూల్‌ను సందర్శించారు. అక్కడ ఆమె విద్యార్ధులతో ఆడుతూ పాడుతూ గడిపారు. ఆ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అయితే కొందరు మాత్రం డ్యాన్స్‌లో ఆమె వేసిన కొన్ని స్టెప్స్‌ను విమర్శిస్తూ  ట్వీట్లు చేస్తున్నారు.