అమెరికా పై ఆధారపడకుండా ఐరోపా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయనున్న ఐరోపా కూటమి

వాస్తవం ప్రతినిధి: అమెరికాపై ఆధారపడకుండా ఐరోపా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలని జర్మనీ విదేశాంగ మంత్రి హీకోమాస్ పిలుపునిచ్చారు.  ద్రవ్యనిధి సంస్థ వంటి స్వతంత్ర చెల్లింపు మార్గాలను ఏర్పాటు చేయటం ద్వారా ఐరోపా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య కొసాగుతున్న సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్‌ (స్విఫ్ట్‌), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటి వ్యవస్థలకు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఐరోపా కూటమి ప్రయత్నాలు ప్రారంభించిందని ఆయన చెప్పారు.ఇటీవల జరిగిన దౌత్యవేత్తల వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు దిశగా తాము అడుగులు వేస్తున్నామని తెలిపారు.