సామజిక మాధ్యమాల పై మండిపడుతున్న ట్రంప్

వాస్తవం ప్రతినిధి: మొన్నటి వరకు మీడియా పై విరుచుకు పడ్డ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సామజిక మాధ్యమాల పై మండిపడుతున్నారు.  తన గురించి సమాచారాన్ని, మంచి వార్తల్ని గూగుల్‌ వంటి సామాజిక మాధ్యమ కంపెనీలు దాచి పెడుతున్నాయనీ, ఇది అత్యంత తీవ్రమైన విషయమనీ ట్రంప్‌ ఆక్షేపించారు. గూగుల్‌లో ఎవరైనా ట్రంప్‌ సంబంధిత వార్తల కోసం శోధిస్తే కేవలం తప్పుడు వార్తలే కనిపిస్తున్నాయంటూ ఆయన ట్వీటర్ ద్వారా తెలిపారు. మొన్నటివరకు మీడియా తీరుపై మండిపడ్డ ఆయన ఇప్పుడు తాజాగా సామజిక మాధ్యమాల పై మండిపడుతున్నారు.