అమెరికాలో తెలుగోళ్ల కలయిక ….ఆప్త పదేళ్ల పండుగ కు సర్వం సిద్దం!

వాస్తవం ప్రతినిధి: పరాయి దేశంలో పలుకే బంగారమైన వేళ.. మన దేశానికి చెందినవారో ..మన రాష్ట్రానికి చెందిన వారో తారస పడితే ఆ సంతోషమే వేరు.. ఇక మన బాష మాట్లాడుతూ స్వంత వారిలా ఆప్తులు ఉంటే ఇక ఆనందానికి అవదులు ఉండవు.. ఉద్యోగ ,వ్యాపార రీత్యా అమెరికా వెళ్లిన తెలుగు వారికి తొలి రోజుల్లో కొంత తెలియని భయం వెంటాడుతుంది.. కనీసం ఎవరితో మాట్లాడలేని పరిస్థితి .. నెల నెలా ఎంతా సంపాదించినా నా అనేవారు లేరని ఎదో వెళితి ..కష్ట సుఖాలు పంచుకునేందుకు మన అనే వారు కానరారు.. ఈ పరిస్థితిల్లో అమెరికా వెళ్లిన కొంత మంది తెలుగు వారి మదిలో పుట్టిన ఆలోచన తో ఏర్పడిందే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ ఆప్త.. మన కోసం మనం అనే నినాదంతో తెలుగు వారి అందరని ఒక కటుంబం లాగా ఆప్తుల్లాగా మలచింది ఆప్త.. 2008 లో సింగిల్ డిజిట్ తో ప్రారంభమైన ఆప్తుల సంఖ్య నేడు పది వేల సంఖ్యకు చేరుకుంది.. అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారు ఒక గొడుకు క్రిందకు వచ్చారు. ఇంకేముంది అంతా ఒక కుటుంబంలాగా అప్పడప్పుడు అన్నింటి లో కలసి మెలుస్తూ ప్రతి ఏటా వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆప్త పదవ వార్షికోత్సవ సభలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 2 వరకు మూడు రోజుల పాటు వాషింగ్టన్ డిసి మేరి ల్యాండ్ బాల్టిమోర్ లో జరిగే ఆప్త జాతీయ మహాసభలకు ప్రపంచ నలుమూలల నుండి ఆప్త కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి రాజకీయ, పారిశ్రామిక, సినీ, వివిధ రంగాల్లోని ప్రముఖులనుఆహ్వానించినట్లు ఆప్త బోర్డు చైర్ శ్రీమతి రాధిక నైగాపుల తెలిపారు. ఆప్త.. ఆప్త ఆహ్వానం అందుకున్న అతిధులు అమెరికాకు పయనమయ్యారు. గడచిన పదేళ్లలో చేసిన సేవా కార్యక్రమాలు సంఘ అభివృద్దిని నెమరువేసుకుంటూ రానున్న రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు లక్ష్యాలను మూడు రోజుల సదస్సు లో నిర్దేశించుకోనున్నట్లు ఆప్తా ప్రెసిడెంట్ గోపాల గూడపాటి తెలిపారు. పదవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఉపాద్యక్షులు మధు ఉల్లి, 2018 కన్వెన్షన్ కన్వినర్ దీరజ్ ఆకుల, కో కన్వినర్సు శ్రీనివాస్ చందు ,నటరాజ్ ఇల్లూరి , రెడ్డయ్యపత్తిపాటి, శ్రీనివాస్ సిద్దినేని, లలితా బైరా, ఆప్త వ్యవస్థాపకులు ప్రసాద్ సమ్మెట , శ్రీనివాస్ చిమట మరియు కన్వెన్షన్ సభ్యులు , ఆప్త డైరెక్టర్లు సమిష్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఆప్త సేవలు విలువైనవి..
మాతృభూమి పై మక్కువతో ఏదేశ మేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని ..నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అనే స్పూర్తి తో ముందు కు సాగుతోంది .అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ ఆద్యర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలోఅనేక సేవా కార్యక్రమాలను చేపట్టి అందరి ఆదరాబిమానాలు చూరగొంటున్నారు. ముఖ్యంగా ప్రతిభ కలిగిన విద్యార్దులకు ఉన్నత చదువులకు డబ్బు ఆటంకం కాకూడదనే ఉద్యేశ్యంతో ఆప్త స్కాలర్ షిప్ లు పంపినికీ శ్రీకారం చుట్టింది.. రెండు తెలుగు రాష్ట్రాలలో వెయ్యి మంది విద్యార్దినీ విద్యార్దులకు కోటిన్నర రూపాయల వరకు ఏటా ఆర్దిక సహాయం చేస్తున్నారు. స్కూల్ బాగ్స్ ను అందచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఎన్నో వైద్య శిభిరాలనుఏర్పాటు చేసి ఉచిత మందులు అందజేసారు. ఆప్త మహిళా విబాగం ఆధ్వర్యంలో అనేక పాఠశాలల్లో ఉచిత శానిటర్ న్యాపికిన్ పంపినీ చేపట్టి ఆదర్శంగా నిలిచారు. విదేశాలకు వెళ్లే విద్యార్దులకు తోడ్పాటు అందించడం , స్కిల్ డవలప్ మెంట్ లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.. అమెరికాలో ఆప్తులంతా ఆనందంగా ఉంటూ వారు చేసే సేవలు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మందికి మున్ముందు మరింతగా ఉపయోగపడాలని ఆశిద్దాం..