బాక్సింగ్ విభాగం లో భారత్ కు తొలి పతకం

వాస్తవం ప్రతినిధి: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల బాక్సింగ్ విభాగం లో  భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. పురుషుల 49 కేజీల లైట్‌ ఫ్లై విభాగంలో జరిగిన క్వార్టర్స్‌లో భారత ఆటగాడు అమిత్‌ పంగల్‌… దక్షిణ కొరియా ఆటగాడు కిమ్‌ జంగ్‌ యాంగ్‌పై విజయం సాధించడం తో సెమీ ఫైనల్ కు చేరుకున్నాడు. దీనితో అమిత్ పతకం ఖాయం చేసుకున్నాడు. ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలో మొత్తం 50 పతకాలు ఉన్నప్పటికీ ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు బాక్సింగ్‌లో ఒక్క పతకం కూడా రాలేదు. అమిత్‌ సాధించిందే తొలి పతకం. ఇప్పటివరకు భారత్ సాదించిన 50 పతకాల్లో 8 స్వర్ణాలు, 19 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి. మరోపక్క 212 పతకాలతో చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.