తండ్రి కొడుకుల ఇద్దరి కార్ల నెంబర్లు ఒక్కటే!

వాస్తవం ప్రతినిధి: నల్లగొండ జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం లో మాజీ ఎంపీ,సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్, జానకీరామ్ లు కూడా అదే ప్రాంతంలో ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో ఎన్టీఆర్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడగా, జానకీ రామ్ మాత్రం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు తెల్లవారు జామున అదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో హరికృష్ణ మృత్యువాత పడ్డారు. నందమూరి జానకి రామ్ 2014లో నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అప్పుడు ఆయన ప్రయాణిస్తున్న కారు నెంబర్ AP 29 BD 2323. ఇక ఈ రోజు నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద కారు యాక్సిడెంట్ తో మృతి చెందిన హరికృష్ణ కారు నెం AP 28 BW 2323 రెండు కూడా ఒకటే కావడం గమనార్హం. ప్రమాద సమయంలో తండ్రి కొడుకులు ప్రయాణిస్తున్న కారు నెంబర్లు యాదృచ్చికంగా ఒక్కటిగా ఉండడం తో నందమూరి అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. కొద్ది సేపటి క్రితం హరికృష్ణ నివాసానికి చేరుకున్న కేటీఆర్ ఆయనికి నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలని అధికారికంగా జరపనునున్నట్టు కేటీఆర్ తెలిపారు. 4 గంటల నుండి అంతిమ యాత్ర ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది.