రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: నల్గొండలో బుధవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దివంగత ఎన్టీఆర్‌ తనయుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.నల్గొండ సమీపంలోని అన్నేవర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి హరికృష్ణను తరలించారు.
నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరై హైదరాబాద్‌కు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఆయనతోపాటు నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదతీవ్రతను బట్టి ఆయన పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ , పురందేశ్వరి , నందమూరి కుటుంబ సభ్యుల హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నారు .
కాగా తీవ్రంగా గాయపడిన నటుడు మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఆసుపత్రి లో మృతి చెందారు. గతంలో ఇదే జిల్లాలో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హరికృష్ణ మృతితో నందమూరి ఫ్యామిలి తీవ్ర విషాధంలో మునిగిపోయింది. నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాధం నెలకొంది.

హరికృష్ణ చరిత్ర ఇలా..

– 1956 సెప్టెంబర్2న జన్మించిన హరికృష్ణ(61)

– తెలుగు ప్రజల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావు పెద్దకుమారుడు..

– శ్రీకృష్ణ అవతారం సినిమాతో బాలనటుడిగా సినిరంగప్రవేశం..

– సినిహీరోగా 1967లో పరిచయమైనా హరికృష్ణ..పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న హరికృష్ణ.. హీరోగా , నిర్మాతగా పనిచేశారు..

– ఎన్టీఆర్ 1982లో టీడీపీ పార్టీ అవిర్భవ సమయం నుంచి నేటి వరకు పార్టీ ముఖ్యనాయకుడిగా ఉన్నారు..

– ఎన్టీఆర్ రథసారథుడిగా గుర్తింపు కల్గిన వ్యక్తి హరికృష్ణ

– ఆయనకు ఇద్దరు భార్యలు.. లక్ష్మీ, శాలినీ.. ముగ్గురు కుమారులు జానికీరామ్, కళ్యాణ్ రామ.. జూనియర్ ఎన్టీఆర్.. కుమార్తే సుహాసిని

– రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

– ప్రస్తుతం టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యుడుగా పనిచేస్తున్నారు..

– నందమూరి వారసుడిగానే కాకుండా వ్యక్తిగతంగా ఎదిగిన హరికృష్ణ..

– ఎన్టీఆర్ చైతన్య రథాన్ని నడిపించిన హరికృష్ణ

– ఆయనకు కుటుంబమంటే అమితమైన ప్రేమ.. ముగ్గురు కొడుకులంటే మరింత ఇష్టం..