మరోసారి గోవా వెళ్లనున్న పారికర్

వాస్తవం ప్రతినిధి: మళ్లీ మరోసారి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్  అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ఆయన ఇటీవల అమెరికాలో చికిత్స చేయించుకొని దేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి వైద్యపరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లనున్నారని ముఖ్యమంత్రి కార్యాయలయ సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ నేపధ్యంలో పారికర్  బుధవారం రాత్రి మరోసారి అమెరికా వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. ఆయన అనార్యోగం బారిన పడటంతో ఆమెరికాలో మూడు నెలల క్రితం చికిత్స చేయించుకుని జూన్‌లో దేశానికి తిరిగి వచ్చారు. అయితే మళ్లీ ఆయన అమెరికా వెళ్లనున్నట్లు సి ఎం కార్యాలయ అధికారులు తెలిపారు. కానీ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.