జమిలి ఎన్నికల కోసం పార్లమెంట్ లో బిల్లు!

వాస్తవం ప్రతినిధి:  దేశవ్యాప్తంగా ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీ కృత నిశ్చయం తో రంగం సిద్దం చేసుకుంటుంది. అందుకోసం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. రాబోయే శీతకాల సమావేశాల్లో గానీ, లేదా పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరిచి గానీ ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌ రావు వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.