తీవ్ర భావోద్వేగానికి లోనైన చంద్రబాబు, లోకేష్

వాస్తవం ప్రతినిధి: నందమూరి హరికృష్ణ మృతి తెలుగుదేశం పార్టీకి, తమ కుటుంబానికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణవార్త తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రత్యేక హెలికాప్టర్ లో హుటాహుటిన నల్గొండకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో హరికృష్ణ భౌతికకాయాన్ని చూసిన చంద్రబాబు, లోకేష్ లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిపర్యంతమయ్యారు. హరికృష్ణ తనకు అత్యంత ఆత్మీయుడని చెప్పిన చంద్రబాబు ఆయన చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు.