హరికృష్ణ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, తెదేపా నేతలు దిగ్భ్రాంతి

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ నటుడు, తెదేపా సీనియర్‌ నేత హరికృష్ణ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, తెదేపా నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణవార్తను విని ఆయన సోదరి దగ్గుబటి పురందేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్, మెహిదీపట్నంలోని హరికృష్ణ ఇంటికి తన భర్త వెంకటేశ్వరరావుతో కలసి చేరుకున్నారు.
హరికృష్ణ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ఎంపీ సుజనాచౌదరి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ సభాపతి కోడెల శివప్రసాద్‌, శాసనమండలి ఛైర్మన్‌ ఎండీ ఫారూఖ్, ఎంపీ కేశినేని నాని, మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అమర్‌నాథ్‌ రెడ్డి, జవహార్‌, నక్కా అనందబాబు, కాలవ శ్రీనివాసులు, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, నారాయణ దితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ తనయుడిగా, కార్యకర్తగా పార్టీ అభివృద్దికి హరికృష్ణ ఎనలేని కృషి చేశారని మంత్రి నారాయణ గుర్తుచేసుకున్నారు.