ప్రజల నోరు నొక్కేందుకే ఈ అరెస్ట్ లు: ప్రకాశ్ అంబేడ్కర్

వాస్తవం ప్రతినిధి: నక్సల్స్ తో సంబంధాలు ఉన్నాయంటూ సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం అనేది ప్రజల నోరు నొక్కేందుకు అని భారిపా బహాజన మహా సంఘ్ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపించారు. ప్రజలపై గొంతు విప్పేది ఎన్జీవోలు, రాజకీయేతర సంఘాలేనని అందుకే వారి కి నక్సల్స్ తో సంబంధాలు ఉన్నాయంటూ వారిని అరెస్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ సంఘాలు ప్రజల్లో వేల్లూనుకుని ఉంటాయని చెప్పారు. ఈ దాడులు, అరెస్టులతో ప్రభుత్వం ప్రజల నోరు మూసేందుకు ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. కానీ సంఘాలు నోరుమూసుకోవని, మరింత క్రియాశీలంగా పనిచేస్తాయని, రాజకీయంగా ఎలాంటి ఆశలు వాటికి ఉండకపోవడమే ఇందుకు కారణమని ప్రకాశ్ అంబేడ్కర్ తెలిపారు. అవి ఎన్నికల్లో పోటీచేయవు.. హక్కుల కోసం పోరాడడమే వాటి పని అన్నారు. దాడులు, అరెస్టులతో సంఘాలు ఇదివరకంటే చురుకుగా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.