అంతర్వేది లో మునిగిన పడవ                    

వాస్తవం ప్రతినిధి: సఖినేటిపల్లి అంతర్వేది సముద్రంలో పడవ మునిగినట్లు తెలుస్తుంది.  చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు మంగళవారం మద్యాహ్నం సమయంలో మునిగినట్లు సమాచారం. అయితే మరో బొటులో ఉన్న మత్స్యకారుల సహయంతో ప్రమాదం లొ చిక్కుకున్న విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం పెదతీనార్లు గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు చింతకాయల రాజు,మెరిగ సత్తిబాబు, చెల్లూరి తాతీలు , వంక నాగరాజు , గరికిన జగదీష్ , మల్లిపల్లి జోగిరాజు లను వేరే బోటు సహాయంతో కాపాడినారు. అందరూ సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడటం లో తీర ప్రాంత మత్స్యకారులు,ప్రమాదం లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు ఊపిరి పిల్చుకున్నారు.