మహారాష్ట్రలో దారుణ ఘటన

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువకులతో చనువుగా ఉంటుంది అని సొంత అక్కనే హత్య చేసాడు మైనర్ తమ్ముడు. మహారాష్ట్ర లోని వాలివ్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  స్థానిక యువకులతో చనువుగా ఉంటోందని ఆమెపై ఆగ్రహం పెంచుకున్న ఆ‌ బాలుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్క(19) ప్రవర్తన పై తీవ్ర ఆగ్రహం తో ఉన్న ఆ బాలుడు(17) ఈ విధంగా ఎవరూ లేని సమయంలో చున్నీ తో ఆమె గొంతుకు చుట్టి నులిమి చంపినట్లు పోలీసులు తెలిపారు. ‘ఆ యువతి ప్రవర్తన బాగోలేదని కొందరు స్థానికులు ఆమె కుటుంబ సభ్యులతో చెప్పి వారిని మరింత రెచ్చగొట్టారు’ అని అక్కడి ఇన్స్‌పెక్టర్‌ భరత్‌ జాదవ్‌ తెలిపారు. ఈ నేపధ్యంలో ఆ బాలుడిపై ఐపీసీ 302 (హత్యా నేరం)కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.