తిరుమల శ్రీవారికి స్వర్ణ కిరీటం

వాస్తవం ప్రతినిధి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశుడికి ఓ భక్తుడు రూ.28 లక్షల విలువైన స్వర్ణ కిరీటం, రూ. 2 లక్షల విలువైన పాదపద్మములను బహూకరించాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియత్తానికి చెందిన కె.దొరస్వామి దంపతులు శ్రీవారి భక్తులు. సోమవారం స్వామి వారిని దర్శించుకున్న వీరు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను కలిసి స్వర్ణ కిరీటం, 1600 గ్రాముల బరువుగల రెండు పాదపద్మములను బహూకరించారు.