అమెరికా విధించిన ఆంక్షల పై న్యాయపోరాటానికి సిద్దమౌతున్న ఇరాన్

వాస్తవం ప్రతినిధి: తమ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసేందుకు ఇరాన్‌ సిద్దమౌతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సంబంధించి హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె)లో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఇరాన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా విధించిన తాజా ఆంక్షలతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఏప్రిల్‌ నుండి ఇప్పటి వరకూ ఇరాన్‌ కరెన్సీ విలువ దాదాపు సగానికి పైగా పతనమైంది. దీంతో ఆంక్షల విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు ఇరాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. 2015 నాటి అణు ఒప్పందం నుండి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మూడు వారాల క్రితం ఇరాన్‌పై కఠిన ఆర్థిక ఆంక్షలను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.