ఇమ్రాన్ కు అభినందనలు తెలిపిన ఆ దేశ సైన్యాధిపతి

వాస్తవం ప్రతినిధి: ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ నెల 18న పాక్‌ ప్రధానిగా పదవీ బాధ్యతలుస్వీకరించిన విషయం తెలిసిందే. అయితే పాక్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆ దేశ సైన్యాధిపతి కమర్‌ జావేద్‌ బజ్వా ఆయనకు అభినందనలు తెలియచేశారు. తొలి సారిగా భేటీ అయిన వీరిరువురూ దేశ భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తుంది. అలానే ఇరువురు నేతలూ దేశంలో శాంతి స్థాపనకు సమిష్టిగా పనిచేస్తామని ప్రకటించారు. సమిష్టి కృషి ద్వారానే ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు సాధ్యమవుతాయని, ఆ దిశగా తాము కలిసి పనిచేస్తామని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.