చైనా లో మళ్లీ మారనున్న జనాభా నియంత్రణ విధానం

వాస్తవం ప్రతినిధి:  చైనాలో జనాభా నియంత్రణ విధానం మళ్లీ మారనుంది. గతంలో ‘ఒకే బిడ్డ’ అని నినదించిన చైనా ప్రభుత్వం మూడేళ్ల క్రితం ‘ఇద్దరు పిల్లల పద్ధతి’కి నాంది పలికిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పద్దతి కి కూడా స్వస్తి చెప్పనుందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ దినపత్రిక  సోమవారం ఒక కధనంలో పేర్కొంది. తరాలుగా వస్తున్న పరిమిత కుటుంబ నిబంధనలను తొలగిస్తూ ఓ పౌర స్మృతిని రూపొందిస్తున్నారని తెలిపింది. దీని గురించి ఇప్పటికే జాతీయ ప్రజా కాంగ్రెస్‌ స్థాయీసంఘం చర్చిస్తోంది. మరి రెండేళ్లలో ఇదొక సమగ్ర రూపం సంతరించుకోవచ్చు. ప్రభుత్వ ప్రతిపాదిత నూతన విధానం సంతాన పరిమితిని పెంచుతుందా లేదా అన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.