ఇండోనేషియా లో భూకంపం!

వాస్తవం ప్రతినిధి: ఏషియన్‌ గేమ్స్‌ ఆతిథ్య దేశం ఇండోనేషియాలో మంగళవారం భూకంపం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే ఈ భూకంప దాటికి ఎలాంటి ప్రమాదాలు, ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అలానే సునామీ వచ్చే అవకాశం కూడా లేదని, భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.2 గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. అయితే  ఈ భూకంప దాటికి 18వ ఏషియా గేమ్స్‌ జరుగుతున్న జకార్త, పలేంబాగ్‌ ప్రాంతాల్లోతో పాటు  టీమర్‌ ఐస్లాండ్‌, కుపాంగ్‌ల్లో భూమి కొంతమేర కంపించింది, అయితే ఎలాంటి నష్టం వాటిల్లేదని అధికారులు తెలిపారు. ఇటీవల లంబోక్‌ దీవుల్లో సంభవించిన భూకంప తీవ్రతకు 80 మందికి పైగా మృతి చెందగా, వేలాది పౌరులు తీవ్ర గాయలపాలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వరుసగా సంభవించిన భూకంపాలతో ఇండోనేషియాలో సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.