భారత్-పాక్ ల మధ్య చర్చలు!

వాస్తవం ప్రతినిధి: ఈ నెల 18 న పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ పాక్ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన తరువాత తోలి సారి అధికారిక చర్చలు జరగబోతున్నట్లు తెలుస్తుంది. సింధు జలాల ఒప్పందంపై భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య బుధవారం లాహోర్‌లో చర్చలు జరగనున్నట్లు సమాచారం. శాశ్వత ఇండస్‌ కమిషన్‌ భారత్‌ కమిషనర్‌ పి.కి.సక్సేనా, పాకిస్థాన్‌ కమిషనర్‌ సయ్యద్‌ మెహర్‌ ఆలీ షాలు ఈ చర్చల్లో పాల్గొంటారు. గత మార్చిలో ఢిల్లీ లో రెండు దేశాల ప్రతినిధులు సమావేశమయి చర్చలు జరిపారు. సింధు జలాల పంపిణీపై 1960లో కుదిరిన ఒప్పందంలోని అంశాలను అమలు తీరుపై ఇరు దేశాలూ ఏటా రెండు సార్లు సమావేశమయి సమీక్ష జరపాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలోనే ఇరు దేశాలు మరోసారి చర్చలు జరపనున్నట్లు తెలుస్తుంది.