న్యూ జెర్సీ లో ఆహ్లాదంగా ఉపాస (UPASA ) సమ్మర్ పిక్ నిక్

వాస్తవం ప్రతినిధి : అమెరికా లో గత వారాంతం అనగా ఆదివారం ఆగస్టు 26 వ తేదీ తెలుగు NRI ల సంఘం ఉపాస (UPASA) సభ్యులు పరస్పర ఆప్యాయ పలకరింపులతో, ఆట పాటలతో, ఆహ్లాదకర వాతావరణం లో తమ వేసవి విహారాన్నీ ఆనందంగా జరుపుకున్నారు.

న్యూ జెర్సీ , మన్రో టవున్ షిప్ , థాంసన్ పార్క్ లో జరిగిన ఈ సంఘ సభ్యుల కుటుంబ వేడుకల్లో పాల్గొనడానికి ఇరుగుపొరుగు రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, కనక్టికట్, న్యూయార్క్ ల నుండి ఉపాస సభ్యులు అనేక మంది తమ కుటుంబాలతో తరలి వచ్చారు .

చుట్టూ పచ్చటి పచ్చిక బయళ్లు , చల్లటి నీడనిచ్చే ఎత్తైన చెట్లు , పక్కనే సెలయేటి తో మనోరంజకంగా వున్న వాతారవరణం లో పిల్ల లు పెద్దలు తమ ఆట పాటలతో ఉత్సాహంగా సమయాన్ని గడిపారు .

ఉపాస సంఘ సభ్యులైన మహిళలు స్వయంగా వండి తీసుకొని వచ్చిన రుచికరమైన పలు రకాలైన  వంట లతో కూడిన భోజనాల ను తింటూ, కబుర్లు చెప్పుకుంటూ, వారికి నచ్చిన సినిమా పాటలు వింటూ ఈ వేసవి విహారం సాగింది .

సభ్యుల్లో కొందరు రెండు జట్లు గా ఏర్పడి వాలీబాల్ ఆటను ఆడుతుండగా , మహిళలు , పిల్లలు షటిల్ బాడ్మింటన్ ఆడటం కనిపించింది .

ఈ సందర్భంగా ఉపాస సంస్థ సభ్యులైన డాక్టర్లు శ్రీ సాయి కొల్ల గారు , శ్రీ రామ్ కొల్ల గారు ఉపాస సభ్యులకు బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు .

భోజనాల అనంతరం సభ్యులందరూ కలిసి హౌసీ ఆట అడగా వచ్చిన నగదు ను డా. శ్రీ సాయి కొల్ల గారు మిషన్ ఉద్దానం పిల్లల జట్టు కు అందచేశారు . ఆ ధనం కిడ్నీ జబ్బులతో బాధ పడుతున్న శ్రీకాకుళం ఉద్దానం ప్రాంత ప్రజలకు అందచేయ బడుతుంది .

ఉపాస సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన డా. శ్రీ సాయి కొల్ల గారు వేసవి విహారానికి విచ్చేసిన సభ్యుల నుద్దేశించి ప్రసంగిస్తూ ” కేవలం సేవ కోసమే స్థాపించిన ఈ సంఘం దిన దినాభివృద్ది చెందడం తన కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, ఈ రోజు ఈ కలయిక కు విచ్చేసిన వారందరికీ తన ధన్య వాదాలు తెలియ చేశారు “

అదే సందర్భం లో ఉపాస సంస్థ సభ్యులు తమ పూర్తి మద్దతు జన సేన పార్టీ కి , ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ కే అని చెప్తూ , జన సేన పార్టీ బ్యానర్ ముందు జన సేన కు అనుకూల నినాదాలు చేశారు .

విహార సంబరాలను నిర్వహించిన కార్యకర్తలు పరస్పరం ఒకరికొకరు అభినందనలు తెలుపుకొంటూ దాదాపు గా సాయంత్రం 7 గంటలకు పార్క్ నుండి ఒకరొకరు గా నిష్క్రమించారు .