విమానాశ్రయం లోనే నిశ్చితార్ధం చేసుకున్న భారత రెజ్లర్!

వాస్తవం ప్రతినిధి: ఏషియన్ గేమ్స్ రెజ్లింగ్‌లో చారిత్రక గోల్డ్ మెడల్ సాధించిన వినేష్ ఫొగాట్ విమానాశ్రయం లోనే నిశ్చితార్ధం జరుపుకుంది. 50 కేజీల ఫ్రీైస్టెల్ రెజ్లింగ్‌లో వినేష్ గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ గెలిచిన తొలి భారతీయ మహిళగా వినేష్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె శనివారం అర్ధరాత్రి ఎయిర్ పోర్ట్ కి చేరుకోగానే తన బాయ్‌ఫ్రెండ్ సోమ్‌వీర్ రాఠి ని నిశ్చితార్ధం చేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఆమె ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా.. అక్కడే సోమ్‌వీర్ ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్రెజెంట్ చేశాడు. ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లోనే రింగులు మార్చుకున్నారు. అదే రోజు వినేష్ తన 24వ పుట్టిన రోజు కూడా జరుపుకోవడం విశేషం. సోమ్‌వీర్ రాఠి కూడా మాజీ జాతీయ స్థాయి రెజ్లర్. ఏడేళ్లుగా ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. వీళ్లు ఎయిర్‌పోర్ట్‌లో ఎంగేజ్‌మెంట్ రింగులు మార్చుకున్న సమయంలో వినేష్ పెదనాన్న మహావీర్ ఫొగాట్, సోమ్‌వీర్ తల్లి అక్కడే ఉన్నారు.  నిజానికి శనివారం ఆమె బర్త్ డే కావడంతో అదే రోజు ఎంగేజ్‌మెంట్ జరుపుకోవాలని సోమ్‌వీర్ భావించాడు. అయితే ఆమె ఎయిర్‌పోర్ట్ చేరుకునేసరికి రాత్రి కావడంతో సోమ్‌వీర్ అక్కడే ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగాడు. గోల్డ్ మెడల్ గెలిచిన వినేష్‌కు ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది.