ఆర్చరీ కాంపౌండ్ ఈ వెంట్ లో సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్న భారత్ పురుషుల టీమ్

వాస్తవం ప్రతినిధి: ఏషియన్ గేమ్స్ ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్‌లో భారత పురుషుల టీమ్ కూడా సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు ఇండియన్ వుమెన్స్ టీమ్ కూడా ఇదే ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పురుషుల టీమ్ కూడా సిల్వర్ మెడల్ ని కైవసం చేసుకుంది. సౌత్‌కొరియాతో జరిగిన ఫైనల్లో హోరాహోరీగా తలపడినా భారత్ కు మాత్రం  ఓటమి తప్పలేదు. నిజానికి 24 షాట్స్ తర్వాత రెండు టీమ్స్ 229 పాయింట్ల దగ్గర సమమయ్యాయి. దీంతో షూట్ ఆఫ్ నిర్వహించారు. అందులోనూ రెండు జట్లు సమంగా స్కోరు సాధించాయి. అయితే ఇండియన్ టీమ్‌తో పోలిస్తే కొరియా టీమ్ ఎక్కువ కచ్చితమైన షాట్లు ఆడటంతో ఆ టీమ్‌ను విజేతగా ప్రకటించారు. ఇండియన్ టీమ్‌లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలు ఉన్నారు.