ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న యువ క్రికెటర్ పృధ్వీ షా

వాస్తవం ప్రతినిధి: ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు తో జరగబోయే నాలుగు,ఐదు టెస్ట్ మ్యాచ్ లకు భారత యువ క్రికెటర్ పృధ్వీ షా కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ భారత యువ క్రికెటర్‌ పృథ్వీ షా ఇంగ్లాండ్‌లో టీమిండియాతో కలిసి మొదటిసారి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఇంగ్లాండ్ చేరుకున్న పృథ్వీ షా సోమవారం జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. టీమిండియాతో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనడం పృథ్వీ షాకు ఇదే మొదటిసారి. పృథ్వీ షాతో పాటు హనమ విహారీ కూడా ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టులకు ఎంపికైన విషయం తెలిసిందే. సోమవారం ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్‌ ద్వారా పంచుకుంది. కోహ్లీ, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్ యాదవ్‌, పృథ్వీ షా, రహానె, కేఎల్‌ రాహుల్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. కోచ్‌ రవిశాస్త్రి ఆధ్వర్యంలో ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. మూడో టెస్టు అనంతరం కాస్త విరామం దొరకడంతో భారత ఆటగాళ్లు పలు ప్రదేశాల్లో తిరుగుతూ సేద తీరారు. మరోపక్క క్యాచ్‌లు చేజార్చడంతోనే మూడో టెస్టులో పరాజయం పాలయ్యామని భావించిన ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు.. ఫీల్డింగ్‌, క్యాచ్‌లు ప్రాక్టీస్‌ చేస్తూనే ఉన్నారు.