‘ అమర్, అక్బర్, ఆంథోనీ ‘ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్

వాస్తవం సినిమా: మాస్ మహారాజ రవితేజ, శ్రీను వైట్ల తాజా చిత్రం ‘ అమర్, అక్బర్, ఆంథోనీ ‘ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది. దర్శకుడు శ్రీనువైట్ల స్వయంగా తన ట్విటర్‌లో ఈ స్టిల్ విడుదల చేశాడు. మూడు పేకముక్కల మీద రవితేజ స్టిల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అమర్, అక్బర్, ఆంథోనీగా ఈ హీరో వేర్వేరు షేడ్స్ లో కనిపిస్తున్నాడు. ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5 న విడుదల కానుంది.మాస్ మసాలా దట్టించిన ఈ సినిమా పూర్తి ఎంటర్ టైనర్ అని మేకర్స్ అంటున్నారు.