బాబాయ్ పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ కు చరణ్ బహుమతి ఏంటో తెలుసా?

వాస్తవం సినిమా: సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అని అందరికీ తెలిసిందే . ఆ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఓ బహుమతి ఇవ్వాలనుకొంటున్నాడట.
టాలీవుడ్ లో టాప్ హీరోగా రాణిస్తూనే, తన అభిరుచి మేరకు చిత్ర నిర్మాతగానూ వ్యవహరిస్తున్న రామ్ చరణ్, ప్రస్తుతం ‘సైరా’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘సైరా’ టీజర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చిన చెర్రీ, ఇప్పుడు బాబాయ్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజున అభిమానులకు మరో బహుమతిని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజుకాగా, ఆరోజు తన కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ లను విడుదల చేయాలని చెర్రీ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిద్వారా మెగా ఫ్యాన్స్ ఆనందం రెట్టింపవుతుందని రామ్ చరణ్ భావిస్తున్నాడు. కాగా, చెర్రీ కొత్త చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ కాగా, కీలక పాత్రలో ఆర్యన్ రాజేష్, విలన్ గా వివేక్ ఓబరాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.