‘పేపర్ బాయ్’ టీమ్ కు ప్రభాస్ సపోర్ట్

వాస్తవం సినిమా: జయ శంకర్ దర్శకత్వంలో సంతోష్ శోభన్ – రియా సుమన్ హీరో హీరోయిన్లు గా నటించి, ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ఆడియన్స్ లో ఆసక్తి పెంచిన ‘పేపర్ బాయ్’ టీమ్ కు సెలబ్రిటీ సపోర్ట్ భారీగానే లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రోమోస్ బాగున్నాయని , సినిమా హిట్ కావాలని సూపర్ స్టార్ మహేష్ బాబు పేపర్ బాయ్ టీం కి విషెస్ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మరో పెద్ద స్టార్ హీరో ప్రభాస్ సపోర్ట్ కూడా ఈ సినిమాకు లభించింది. ‘పేపర్ బాయ్’ టీమ్ ప్రభాస్ ను ఈమధ్య కలిసింది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ శోభన్ గారు తనకు ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘వర్షం’ ఇచ్చిన డైరెక్టర్ అని – అయన తనయుడు సంతోష్ శోభన్ కు ‘పేపర్ బాయ్’ టీమ్ కు అల్ ది బెస్ట్ అని చెప్పాడు. తను నటించిన ‘బిల్లా’ సినిమా సినిమాటోగ్రాఫర్ సౌందరరాజన్ ఈ సినిమాకు పనిచేశాడని – ఈ సినిమా ఫోటోగ్రఫీ సూపర్ గా ఉందని మెచ్చుకున్నాడు.

ఇకపోతే, డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో కంటెంట్ ను చూసిన ఇంప్రెస్ అయిన అల్లు అరవింద్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను హోల్ సేల్ గా తీసుకొని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై నెలకొన్న బజ్ చూస్తుంటే టాలీవుడ్ కు మరో హిట్ సినిమా రెడీ అవుతుంది అనిపిస్తోంది.