“కేసీఆర్” ని నడిపిస్తున్న “అజ్ఞాత” వ్యక్తి ఎవరు..?

వాస్తవం ప్రతినిధి:  చంద్రబాబు తో వచ్చిన కయ్యం తో పంతం పట్టిన కేసీఆర్ తెలంగాణా ఉద్యమాన్ని తెరపైకి తీసుకువచ్చి ఒక్కసారిగా ప్రభుత్వానికి ఏకుమేకయ్యాడు…పట్టిన పట్టు విడవకుండా ఒక పక్కా వ్యూహరచనతో ఉద్యమ నేతగా, టీఆరెస్ పార్టీ అధినేతగా చివరికి తెలంగాణా రాష్ట్రం సాధించి ఏకంగా తెలంగాణా ముఖ్యమంత్రిగా ఈ రోజు ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు..మళ్ళీ తెలంగాణా ముఖ్యమంత్రిగా తానే ఉండాలనే కోరికతో కేసీఆర్ పన్నే వ్యూహాలు కూడా తప్పకుండా ఫలిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాడు అయితే 

తెలంగాణా లో కేసీఆర్ వ్యూహాలు రాజకీయ నేతలకి దిమ్మతిరిగిపోఎలా ఉంటాయి…తానూ అనుకున్నది చేస్తాడు తప్ప ఎవరు చెప్పినా పట్టించుకోడు..లాభమో నష్టమే కేసీఆర్ భరిస్తాడు ఇప్పుడు ముందుస్తు ఎన్నికలు అంటూ తెగ హడావుడి చేస్తూ ఢిల్లీ టూర్ లు కూడా చేస్తున్నాడు . ఎప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఎన్నికలకు వెళ్ళిపోదామని అనే తొందర కేసీఆర్ లో స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు అయితే కేసీఆర్ అంతగా తొందర పడటానికి అసలు మేటర్ వేరే ఉందని తెలుస్తోంది..

ఇంతకీ కేసీఆర్ ఎందుకు ముందస్తు కి దూకుడుగా ఉన్నారు అంటే… వాస్తుజ్యోతిష్యం లాంటి వాటిని గట్టిగా నమ్మే కేసీఆర్.. ఈసారి ఎన్నికల విషయంలో కూడా ఈ సెంటిమెంట్ తో ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది..అంతేకాదు  సుద్దాల సుధాకర్ తేజ అనే నమ్మకమైన వాస్తు నిపుణుడిని తీసుకు వచ్చి మరీ ప్రభుత్వంలో కూర్చోపెట్టి ప్రభుత్వానికి సంభందించిన అన్ని వాస్తు దోషాలని వివరించి మార్పులు చేర్పులు ఆమధ్య చేయించారు..

కేవలం ఆ  జ్యోతిష్యుడి మాటల వల్లే గతంలో సీఎం అయిన తొలి రోజుల్లో కేసీఆర్ నల్ల కార్లను వెనక్కి పంపి తెల్ల కార్ల కాన్వాయ్‌కి మారారు. ఇదిలాఉంటే వేముల వాడ రాజన్న గుడికి వెళ్తే.. పదవి పోతుందని ఉన్న సెంటిమెంట్ ని ఈ జ్యోతిష్యుడి మీదున్న నమ్మకంతోనే మార్చుకున్నారు ఎవరు ఎంత చెప్పినా వినకుండా 2015 జూన్లో ధైర్యంగా వేములవాడ వెళ్లి రాజన్న దర్శనం చేసుకున్నారు…దాంతో ఇతడిపై మరింత నమ్మకం ఏర్పడింది దాంతో ఇప్పుడు “2019” ఎన్నికల సెంటిమెంట్ ని కూడా ఈ  విధంగానే ఫాలో అవుతున్నారని టాక్ వినిపిస్తోంది..దీన్ని బట్టి చూస్తే నడిచేవాడు కేసీఆర్ అయితే నడిపించే వాడు జ్యోతిష్యుడు అంటూ కాంగేస్స్ వాళ్ళు సెటైర్స్ వేస్తున్నారు..