కేంద్రం బాబు ని టార్గెట్ చేస్తోందా..? బాబు అరెస్ట్ తధ్యమేనా..?

వాస్తవం ప్రతినిధి:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కేంద్రం టార్గెట్ చేసిందా..? ఎన్నికల ముందుగానే చంద్రబాబు ని కట్టడి చేయడానికి కేంద్రం వ్యూహాన్ని పన్నుతోందా..? టీడీపీలో కొందరి నేతల అరెస్ట్ ల పై కేంద్రం రంగం సిద్దం చేసిందా..? అంటే అవుననే అంటున్నాయి విశ్లేషకుల వాదనలు..అయితే ఈ సందేహాలు ఇప్పుడు ఎందుకు కలుగుతున్నాయి. అంటే బీజేపీ నేత  జీవీఎల్ నరసింహారావు ఈరోజు చేసిన కామెంట్స్ ఈ సందేహాలకి ప్రధాన కారణం అవుతున్నాయి. వివరాలలోకి వెళ్తే..

 

కేంద్రంతో చంద్రబాబు తెగతెంపులు చేసుకున్న తరువాత బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీ ని , చంద్రబాబు ని ఏరకంగా టార్గెట్ చేశారో వేరేగా చెప్పనవసరం లేదు..ఏపీలో ఉన్న బీజేపీ నేతలు మొదలు..కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్ద తలకాయలు అందరూ కూడా బాబునే టార్గెట్ చేశారు..అంతేకాదు వీలు దొరికినప్పుడల్లా బాబు పై అవినీతి విమర్శలు చేస్తూ కేంద్రం ఇచ్చిన నిధులపై పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన అవకతవకలపై నిలదీస్తూ ఈ విషయంలో బాబు పై విచారణ జరపాలని డిమాండ్ చేసేవారు.. అయితే ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ నేత జీవీఎల్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు..

టీడీపీ ప్రభుత్వానికి విలాసాల మీద ఉన్న ధ్యాస వికాసంపై లేదని దుయ్యబట్టారు. టీడీపీ ధర్మపోరాటం పేరుతో దొంగ పోరాటం చేస్తున్నారని స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కార్పొరేట్ సంస్థల అధిపతి మంత్రిగా ఉన్నారని అన్నారు.. అంతేకాదు ప్రభుత్వం రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణం అని ఆరోపించారు.. నిధులను పార్టీ ఫండ్‌లోకి మళ్లిస్తున్నారనే అనుమానం ఉందన్నారు..

అంతేకాదు టీడీపీ ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా జాతీయ స్థాయిలో నిఘా ఉంటుందని తప్పకుండా ఎదో ఒక రోజున చంద్రబాబు వీటన్నిటికీ సమాధనం చెప్పవలసిన అవసరం ఉంటుందని తెలిపారు…అయితే గతంలో కూడా ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు పై ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ బాబు జైలుకెళ్ళడం ఖాయం అంటూ వ్యాఖ్యలు చేశారు అంతేకాదు బాబు తో పాటు కొందరు మంత్రులు కూడా జైలు కెళ్ళే పరిస్థితి ఉందని వ్యాఖ్యలు రావడంతో ఇప్పుడు జేవీఎల్ వ్యాఖ్యలకి అప్పట్లో బీజేపీ నేతల వ్యాఖ్యలకి పోల్చి చూస్తే బీజేపీ బాబు వెనుకాల ఎదో భారీ  స్కెచ్ ప్లాన్ చేసుకుందని భావిస్తున్నారు పరిశీలకులు..