ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టదు: స్టాలిన్

వాస్తవం ప్రతినిధి: అన్నా డిఎంకె పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదని డిఎంకె నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంకె స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. డీ ఎం కే నూతన అధ్యక్షుడిగా ఈ రోజు స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలానే అన్నా డిఎంకె ప్రజల కోసం పని చేయడం లేదని స్టాలిన్  ఆరోపించారు. అలానే బిజెపి మత రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రధాని నరేంద్ర మోదీ ని వెంటనే అధికారంనుంచి దించేయాలని ఆయన డిమాండ్ చేశారు.