జనసేన” లోకి…“జంప్”  చేసే “ఎమ్మెల్యేల లిస్టు” ఇదే

వాస్తవం ప్రతినిధి: ఏపీలో పొలిటికల్ పార్టీల వ్యూహాలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతున్నాయి..జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది మొదలు పొలిటికల్ గేమ్ మరింత ఆసక్తిగా మారిపోయింది..అంతేకాదు గుంటూరు వేదికగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ,లోకేష్ పై చేసిన వ్యాఖ్యలకి ఏకంగా ఏపీ పోలిటిక్స్ లో భారీ మార్పులు చేరుకున్నాయి..పవన్ కళ్యాణ్ చేసే ప్రతీ రాజకీయ ప్రసంగంలో చంద్రబాబు లోకేష్ ల అవినీతి గురించి మాట్లాడుతూ టీడీపీ నేతలో గుబులు రేపాడు..మరో పక్క తెలివిగా బీజేపీ తో బాబు జైలుకెళ్ళే పరిస్థితి ఉంది అనే ప్రచారం జరగడంతో పార్టీ పై నేతలకి భయం రేకెత్తించేలా చేశాడు..అయితే

ఈ క్రమంలోనే టీడీపీ నేతలకి పార్టీపై నమ్మకం సన్నగిల్లుతోంది అనే టాక్ కూడా వచ్చింది..అంతేకాదు టీడీపీ లో టెన్షన్ వాతావరం కూడా నెలకొంది..భవిష్యత్తు ప్రస్నార్ధకంగా మారింది..టీడీపీ ని వీడి జనసేన పార్టీలోకి ముఖ్యనేతలు వెళ్లనున్నారు అనే టాక్ మరింతగా రావడంతో టీడీపీ పై కుట్ర జరుగుతోంది అంటూ చంద్రబాబు స్పందించవలసి వచ్చింది..దాంతో చాలా మంది ఎమ్మెల్యేలు జనసేన వైపు చూస్తున్నారు అంటూ కధనాలు కూడా వచ్చాయి..అయితే సరిగ్గా వారం క్రితం..

త్వ‌ర‌లోనే 22మంది ఎమ్మెల్యేలు జ‌న‌సేన‌లో చేర‌బోతున్న‌ట్లుగా ఆ పార్టీ నేత పార్థ‌సార‌ధి చెప్పడం గతంలో ఒక సభలో పవన్ కళ్యాణ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో మళ్ళీ చంద్రబాబులో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే గతంలో కళా వెంకట్రావు లాంటి వాళ్ళు సైతం టీడీపీ ని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిన వాళ్ళే అయితే ఇప్పుడు దాదాపు 22మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారు అని జనసేన నాయకులు చెప్పడంతో దాదాపు వారి పేర్లు కూడా ఖరారు అయ్యాయని టాక్ వినిపిస్తోంది..అయితే ఆ 22 మంది లిస్టు ఇదే అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది.

అయితే ఈ జంపింగ్ నేతల లిస్టు లో టాప్ లో ఉంది మాత్రం గంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది..అంతేకాదు ఆయ‌న‌తో పాటు విశాఖ జిల్లాకే చెందిన మాజీ పీఆర్పీ నేత‌లు పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు -య‌ల‌మంచిలి, ప‌ల్లా శ్రీనివాస్- గాజువాక‌ ఎమ్మెల్యేల పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి…అంతేకాదు వీరికి తోడుగా పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత పేరు కూడా జనసేన నేతల లిస్టు లో ఉందని అంటున్నారు..ఇక తూర్పు గోదావ‌రిలో తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ -జ‌గ్గంపేట‌, వ‌రుపుల సుబ్బారావు – ప్ర‌త్తిపాడు పేర్లు వినిపిస్తున్నాయి..అయితే ఈ ఇద్దరూ కూడా వైసీపీ నుంచీ టీడీపీ లోకి వెళ్ళిన వాళ్ళే..

ఇక ఈ లిస్టు లో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌న్నారాయ‌ణ చేరిక దాదాపు ఖరారు అయ్యిందని అంటున్నారు ఇక ప‌శ్చిమ విషయానికి వస్తే భీమవరం ఎమ్మెల్యే గంటా వియ్యంకుడు అయిన పుల‌ప‌ర్తి నారాయ‌ణ‌మూర్తి కృష్ణా జిల్లా నుంచీ కాగిత వెంక‌ట్రావు – పెడ‌న‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి..ఇక ముందు నుంచీ అనుకున్తునట్టుగానే కూడా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియా కూడా జనసేన కండువా కప్పుకుంటారు అనే ప్రచారం జరుగుతోంది. వారికితోడుగా మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్న నేప‌థ్యంలో మొత్తం 20మంది ఎమ్మెల్యేలు క‌నీసంగా జ‌న‌సేన వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు..ఈ వార్తల్లో నిజం ఎంతవరకూ ఉందనేది తెలియదు కానీ మొత్తానికి ఈ అభ్యర్ధుల లిస్టు ఏపీలో టీడీపీ లో టెన్షన్ పెట్టిస్తుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.