కేరళ లో పర్యటిస్తున్న రాహుల్!

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇటీవల అక్కడ కురిసిన భారీ,వర్షాలు,వరదల కారణంగా ఆ రాష్ట్రం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. కేరళలో వరద బీభత్సానికి రాష్ట్రానికి దాదాపు రూ.20వేల కోట్లకు పైగా నష్టం వాటల్లిన సంగతి తెలిసిందే. నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల కొద్దీ ఇళ్లు, రోడ్లు, భవనాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్రం లో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహు ల్ గాంధీ కేరళ వెళ్లారు. ఈ రోజు ఉదయం త్రివేండ్రం విమానాశ్రయం చేరుకున్న రాహుల్‌ చెన్‌గన్నూర్‌కు వచ్చారు. అక్కడ ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి వెళ్లి బాధితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం అధికంగా ఉన్న చెన్‌గన్నూర్‌, అలపుజా, అంగమలీ ప్రాంతాల్లో ఈరోజు పర్యటించనున్నారు. రేపు వాయాంద్‌ జిల్లాలో పర్యటించనున్నారు.