టీడీపీ నాయకులపై మండిపడ్డ అంబటి రాంబాబు

వాస్తవం ప్రతినిధి:వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, బీజేపీతో కుమ్మక్కు అయితే ఈడీ కేసు ఎందుకు పెట్టిందని టీడీపీ నేతలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. ‘చంద్రబాబు ఆదేశాలతోనే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు.కళా వెంకట్ రావు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా…. లేకుండా మాట్లాడుతున్నారో అర్థం కావటంలేదని విమర్శించారు. మోడీతో లాలూచీ ఉంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే దుస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తుందని పేర్కొన్నారు. జగన్ పై 43వేల కోట్ల రూపాయల అవినీతి అని నిరూపిస్తే రాజకీయల నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. జగన్ కేసులో 1200 కోట్లపై మాత్రమే విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ బలమైనది అంటారు…. మరోవైపు కాంగ్రెస్ తో మాట్లాడి బెయిల్ తెచుకున్నామంటున్నారు. ఇదెలా సాధ్యమని నిలదీశారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి వైసీపీలో గెలిచి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. యనమల ఆర్ధిక శాఖ మంత్రి కాదు… అబద్ధాల శాఖ మంత్రి అని ఆరోపించారు. తుని ఘటనలో ఇప్పటికి దోషులను ఎందుకు తేల్చలేదని అంబటి నిలదీశారు.