షేర్ల ను విక్రయించిన సత్య నాదెళ్ల

వాస్తవం ప్రతినిధి: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల తన పేరున ఉన్న షేర్లను విక్రయించారు. 36 మిలియన్ల విలువైన 3,28,000 షేర్లను ఆయన విక్రయించినట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ విధంగా సత్య షేర్లను అమ్మడం ఇదే తొలిసారి ఏమీ కాదు. 2014 లో మైక్రోసాఫ్ట్ సి ఈ వో గా భాద్యతలు చేపట్టిన ఆయన రెండేళ్ళ క్రితం 8.3 మిలియన్ డాలర్ల విలువైన 1,43,000 షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే.  ఈ సారి ఒక్కో షేరు విలువ 109.08 డాలర్లు నుంచి 109.68డాలర్లు వరకు అమ్మినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. సత్యనాదెళ్లకు ఉన్న వ్యక్తిగత ఆర్థిక కారణాల వల్లే ఆయన తన షేర్లను అమ్ముకున్నారని సంస్థ ప్రతినిధి తెలిపారు. స్టాక్‌ సేల్‌ నివేదిక ప్రకారం ఆయన దగ్గర ఇంకా 7,78,596షేర్లు ఉన్నాయి. గతేడాది ఆయన 1.45మిలియన్‌ డాలర్లు వేతనంగా అందుకున్నారు.