విమానాన్ని ఎత్తుకెళ్ళిన మెకానిక్….గగనతలంలో షికారు!

వాస్తవం ప్రతినిధి: విమానాయాన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉన్నట్టుండి విమానాన్ని ఎత్తుకెళ్లి షికార్లు కొట్టాడు. అయితే షికారు కొట్టడానికి గగనతలంలోకి తీసుకెళ్లిన అతను ఆపై కంట్రోల్ చేయలేకపోవడం తో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శుక్రవారం సాయంత్రం అమెరికాలోని వాషింగ్టన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  విమానం ఒక్కసారిగా గాలిలోకి ఎగరడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇది ఉగ్రవాదుల చర్య అయి ఉంటుందని తొలుత పోలీసులు అనుమానించి వెంటనే జెట్‌ విమానాలతో ఆ విమానాన్ని వెంబడించారు. తీరా ఇది ఉగ్రవాద చర్య కాదు ఒక ఉద్యోగి పని అని తెలుసుకొని అందరూ ఊపిరి తీసుకున్నారు. అలాస్కా ఎయిర్‌ లైన్స్‌కు చెందిన ఓ మోకానిక్‌ ఈ చర్యకు పాల్పడ్డట్టు గుర్తించారు. ఈ సమయంలో విమానంలో అతను తప్ప ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే విమనాన్ని కొంతదూరం తీసుకెళ్లగలిగిన మోకానిక్‌ ఆ తరువాత కంట్రోల్‌ చేయలేకపోవడంతో వాషింగ్టన్‌ ప్రాంతంలో క్రాష్‌ చేశాడని పోలీసుల అధికారులు తెలిపారు. క్రాష్‌ అయిన విమానం 76 సీట్ల సామర్థ్యం గల విమానం అని, ఆత్మహత్య చేసుకునేందుకు అతను ఇలా చేసి ఉంటాడని అధికారులు అనుమానం వ్యక్త్యం చేస్తున్నారు. అయితే విమానం క్రాష్‌ కావడంతో అతను గాయాలతో బయటపడినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.