ఎన్టీఆర్ ‘అరవింద సమేత’కు లీకుల బెడ‌ద..తాజాగా టీజర్ ఫొటోలు లీక్

 వాస్తవం సినిమా: పెద్ద సినిమాలకు కొంతమంది ఆకతాయిలు పెట్టే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కంటెంట్ లీకేజ్ పేరుతో భారీ సైజు ప్రాజెక్టుల్ని సైతం చిక్కుల్లో పడేస్తున్నారు లీకు వీరులు. ఫ్యాన్స్‌కి తారక్ తీపి కబురు అంటూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘అరవింద సమేత’ టీజర్ విడుదల చేయనున్నట్లు అఫీషియల్ స్టేట్మెంట్ ఆలా వచ్చిందో ఇలా.. లీక్డ్ టీజర్ బైటికొచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’ . ఇప్ప‌టికే నాగ‌బాబు ఎన్టీఆర్ క‌లిసి ఉన్న ఫోటోలు లీక్ అవ్వ‌గా తాజాగా మ‌ర‌న్ని ఫోటోలు లీక్ కావ‌డంతో సినిమా యూనిట్ అందోళ‌న‌లో ఉంది.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శకుడు త్రివిక్రమ్ ఇకపై షూటింగ్ స్పాట్‌లోకి ఎవరూ ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశాలు జారీ చేశాడట. అయినప్పటికీ తాజాగా ఫొటోలు లీకవడం యూనిట్‌ను కలవరపెడుతోంది. విడుదలైన ఫొటోలలో సీన్‌కు సంబంధించిన సమయం కూడా ఉండడంతో యూనిట్‌లోని వారే ఎవరో వీటిని నెట్‌లో పెట్టి ఉంటారని భావిస్తున్నారు.