బాలికలకు ఉచితంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్

వాస్తవం ప్రతినిధి: బంగారు తెలంగాణ కార్యాచరణలో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాల ను తెలంగాణలో తీసుకు వస్తున్నారు సీ ఎం కేసీఆర్. తాజాగా రాష్ట్ర్ర వ్యాప్తంగా మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లోచదువుతున్న 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థినిలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ఈ పథకం తీసుకు రావాలని చూసినా కొన్ని అవాంతర కారణాల తో ఆగిపోయింది. అయినప్పటికినీ దేశంలోని విద్యార్థినిల ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించడానికి ఏకైక రాష్ట్రం గా తెలంగాణ ముందుకు వచ్చింది.
రాష్ట్రంలో బాలికల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఎనిమిది లక్షల మంది బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ప్రతి కిట్టులో 16 రకాల వస్తువులను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కిట్ విలువ రూ.400 ఉంటుందని, మూడు నెలలకోసారి ఏడాది పొడవునా ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.100 కోట్లను వెచ్చిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, అన్ని గురుకుల విద్యాలయాల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ కిట్లను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అవుతుందని పేర్కొన్నారు.
తమకు ఈ కిట్లు అందడంతో స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపయోగ పడే ఈ కిట్ల విద్యార్దునులు సంతోష్ వ్యక్తం చేస్తున్నారు. లేడి గవర్నర్ విమలా నరసింహన్ చేతుల మీదుగా రాజ్ భవన్ స్కూలు లో ప్రారంభమయిన ఈ పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య అందించనున్నారు.