ఓయూ లో రాహుల్ సదస్సుకు అనుమతి లభించలేదు!

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ నియమితులైన తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని రాహుల్ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సదస్సు చేపట్టాలని భావించారు. అయితే ఆ సదస్సుకు రాహుల్ కు అనుమతి లభించలేదు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో రాహుల్ అధ్యక్షతన నిర్వహించే సదస్సుకు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ రామచంద్రం అనుమతి నిరాకరించారు. ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఓయూలో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. అయితే ఓయూ జేఏసీ, టీఆర్‌ఎస్వీ, బీసీ సంఘాల విద్యార్థి నేతలు రాహుల్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా రాహుల్‌ను ఓయూలోకి అడుగుపెట్టనివ్వబోమని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.