అలకతో ఉన్న అనూను టీజ్ చేస్తూ చైతూ పాట

వాస్తవం సినిమా: సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ రూపొందింది. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు వీడియో సాంగ్ ను వదిలారు. “బేబీ .. అనూ బేబీ ..” అంటూ ఈ సాంగ్ సాగుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ అలకతో నడుస్తూ వుంటే, ఆమెను టీజ్ చేస్తూ చైతూ పాడే పాట ఇది.  గోపీసుందర్ చేసిన ట్యూన్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ పాటకి చైతూ వేసిన స్టెప్స్ కూడా కొత్తగా .. యూత్ ను ఉత్సాహపరిచేలా వున్నాయి. పాటలో నాగచైతన్య చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండగా, అనూ మరింత గ్లామరస్ గా అలరిస్తోంది. ఈ సినిమాలో చైతూ అత్తగారిగా పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.